cow: తమిళనాడులో ఆవుకు సీమంతం వేడుక

Kallakurichi Villagers Perform Baby Shower function grand scale For Pregnant Cow
  • హాజరైన 500 మంది అతిథులు
  • 24 రకాల వంటకాలతో విందు ఇచ్చిన ఆలయ ట్రస్ట్
  • ఆవుకు కానుకలు అందించిన అతిథులు
హిందువులు ఆవును భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు తమ కుటుంబ సభ్యులలాగా పెంచుకుంటారు. అలాగే, తమిళనాడులోని ఓ ఆలయంలోని గోమాతకు అంగరంగ వైభవంగా సీమంతం వేడుకను జరిపించారు. రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న అంశవేణి అనే అవుకు ఈ వేడుక చేశారు. సీమంతం వేడుకకు అంశవేణిని బాగా అలంకరించారు.

అంశవేణి సంరక్షణ చూస్తున్న ఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్టులు కూడా అందించారు. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి.

సీమంతం వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు అంశవేణికి స్నానం చేయించారు. అనంతరం పూలు, గంటలతో అంశవేణిని అలంకరించారు. కార్యక్రమం పూర్తయ్యాక వచ్చిన అతిథులంతా అంశవేణి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
cow
baby shower function
Tamilnadu
temple trust

More Telugu News