బాలీవుడ్ బ్యూటీతో వచ్చే వారం ప్రభాస్ ఎంగేజ్ మెంట్ అంటూ వార్తలు.. నిజం ఏమిటంటే..!

  • కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్ మెంట్ అంటూ వార్తలు
  • వచ్చే వారం మాల్దీవ్స్ లో నిశ్చితార్థం అంటూ ప్రచారం
  • ఆ వాార్తల్లో నిజం లేదన్న ప్రభాస్ టీమ్
Prabhas and Kriti Sanon engagement

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఏళ్ల తరబడి వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ అందాల భామ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

 తాజాగా వీరికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. వచ్చే వారం ఈ ప్రేమజంట మాల్దీవ్స్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటోందనేదే ఆ వార్త. ఈ ఎంగేజ్ మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభాస్ టీమ్ స్పందించింది. ప్రభాస్, కృతి ఇద్దరూ స్నేహితులు మాత్రమేనని... ఎంగేజ్ మెంట్ వార్తల్లో నిజం లేదని తెలిపింది.  

మరోవైపు ఇదే అంశంపై బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. వచ్చే వారం మాల్దీవ్స్ లో ప్రభాస్, కృతి ఇద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని... వారిద్దరూ ఒకటి కాబోతుండటం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశాడు.

More Telugu News