కేజీఎఫ్2 రికార్డును బద్దలు కొట్టిన పఠాన్

  • హిందీ వెర్షన్ లో భారత్ లో రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టిన  షారుక్ చిత్రం
  • ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 కోట్లు సాధించిన వైనం
  • విడుదలై రెండు వారాలు దాటినా ఆగని కలెక్షన్లు
Pathaan box office Day 15 SRKs film beats Yashs KGF 2 Hindi in India

షారుక్ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. విడుదలై రెండు వారాలు అవుతున్నప్పటికీ ఈ చిత్రం అదే జోరుతో దూసుకుపోతోంది. అన్నిభాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 800 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన ‘పఠాన్’ భారత బాక్సాఫీస్ వద్దనే రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

దాంతో, స్వదేశంలో హిందీ వెర్షన్ ద్వారా రూ. 500 కోట్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్2’ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణే‌ కథానాయికగా నటించింది. జాన్ అబ్రహం ప్రతి నాయకుడిగా మెప్పించాడు. ఇదే జోరు కొనసాగిస్తే ఈ చిత్రం మరికొన్ని రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News