Team India: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్.. టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చిన షమీ, సిరాజ్

  • టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • ఓపెనర్లను పెవిలియన్ చేర్చిన షమీ, సిరాజ్
  • ఆసీస్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు
Good start for Team India against Australia in first test match

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే, టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపో నిలవలేదు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ లు ఆదిలోనే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చారు. 

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలు ఆసీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. తొలి ఓవర్ ను షమీ వేయగా 2 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ ను వేసిన సిరాజ్ తొలి బంతికే ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మొత్తం 3 బంతులను ఎదుర్కొన్న ఖవాజా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ తొలి బంతికి వార్నర్ ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 బంతులను ఎదుర్కొన్న వార్నర్ కూడా ఒక్క పరుగుకే నిరాశతో వెనుదిరిగాడు. ప్రస్తుతం లబుషేన్ (13), స్టీవెన్ స్మిత్ (6) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 7 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు.  

టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. 

ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవెన్ స్మిత్, మ్యాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్ కూంబ్, అలెక్స్ కేరీ (కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), లియోన్, మర్ఫీ, స్కాట్ బోలాండ్ ఉన్నారు. 

More Telugu News