Sensex: నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • రెండు రోజుల నష్టాలకు ముగింపు
  • 378 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలక రేట్లను ఆర్బీఐ పెంచడం, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్లలో జోష్ నింపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 378 పాయింట్లు లాభపడి 60,664కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17,872కి ఎగబాకింది. ఐటీ, హెల్త్ కేర్, టెక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.14%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.47%), రిలయన్స్ (1.99%), ఇన్ఫోసిస్ (1.75%), విప్రో (1.57%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.62%), భారతీ ఎయిర్ టెల్ (-1.31%), యాక్సిస్ బ్యాంక్ (-0.78%), కోటక్ బ్యాంక్ (-0.59%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.58%).

More Telugu News