Biden: మా జోలికొస్తే ఖబడ్దార్.. చైనాకు బైడెన్ హెచ్చరిక

  • చైనా బెలూన్ ను కూల్చేసిన అమెరికా ఆర్మీ
  • పొరపాటున వచ్చిన బెలూన్ ను కూల్చేయడమేంటని మండిపడ్డ చైనా
  • ఈ విషయంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం
Joe Biden warns China over threats to US sovereignty in State of the Union address

అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ తేల్చిచెప్పారు. చైనాకు చెందిన బెలూన్ అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ బెలూన్ ను అమెరికా కూల్చేయడంపై చైనా నిరసన వ్యక్తం చేసింది. పొరపాటుగా అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన బెలూన్ ను కూల్చేయడం సరికాదని విమర్శించింది. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ సందర్భంగా చైనాకు అమెరికా అధక్షుడు బైడెన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈమేరకు బుదవారం స్టేట్ ఆఫ్ యూనియన్ లో బైడెన్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కూడా బైడెన్ ఈ సందర్భంగా విమర్శించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం యుగయుగాలకూ పరీక్ష అని అన్నారు.

More Telugu News