అందాల ఆషిక రంగనాథ్ డ్రీమ్ అదేనట!

  • ఈ నెల 10న రిలీజ్ అవుతున్న 'అమిగోస్'
  • కల్యాణ్ రామ్ జోడీ కట్టిన ఆషిక రంగనాథ్ 
  • స్టార్ హీరోల సినిమాల నుంచి వస్తున్న ఆఫర్లు 
  • రాజమౌళి సినిమాలో చేయాలనుందని ఆషిక వెల్లడి  
Ashika Ranganath Interview

'అమిగోస్' సినిమాలో కల్యాణ్ రామ్ జోడీగా ఆషిక రంగనాథ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. చందమామ వంటి ముఖం .. వెన్నెల మాదిరి నవ్వుతో ఆకట్టుకునే ఈ బ్యూటీకి అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆషిక బిజీగా ఉంది. "ఒక హీరోయిన్ గా మీ ముందున్న అతిపెద్ద డ్రీమ్ ఏమిటి?" అన్న ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆమెకి ఎదురైంది. అందుకు ఆషిక స్పందిస్తూ .. "హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రాజమౌళిగారి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. ఆయన సినిమాలో చేయాలనేదే నా డ్రీమ్" అంటూ చెప్పుకొచ్చింది. 

ఆషిక రంగనాథ్ గ్లామర్ చూసిన వాళ్లంతా ఇక్కడి స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకి వరుస అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు. స్టార్ హీరోయిన్స్ రేసులో ఆమె చేరిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే రాజమౌళి సినిమాలో ఛాన్స్ దక్కడం తేలికవుతుంది.

More Telugu News