వామ్మో .. డాన్స్ చేయాలంటే ఆ టెన్షన్ తో నాకు నిద్రకూడా పట్టదు: కల్యాణ్ రామ్

  • ఆసక్తిని పెంచుతున్న 'అమిగోస్'
  • మూడు డిఫరెంట్ రోల్స్ లో కల్యాణ్ రామ్ 
  • తనకి డాన్సులంటే భయమని వెల్లడి 
  • ఆ పాట బాగా రావడానికి అదే కారణమని వ్యాఖ్య 
  • ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న సినిమా     
Amigos movie update

కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'అమిగోస్' .. ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో దర్శకుడిగా రాజేంద్ర పరిచయమవుతున్నాడు. గిబ్రాన్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆషిక రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా నాకు డాన్సులు అంటే భయం .. ఒక రకమైన షివరింగ్ వచ్చేస్తుంది. డాన్సు చేయాలంటే రెండు మూడు రోజుల పాటు టెన్షన్ తో నిద్రపట్టదు. రిహార్సల్స్ అన్నా ..  వన్ మోర్ అన్నా అంతే టెన్షన్ గా ఉంటుంది. అలాంటి టెన్షన్ ఈ సినిమాకి కూడా పడాల్సి వచ్చింది" అన్నాడు. 

"'ఎన్నో రాత్రులొస్తాయిగానీ .. 'పాట కోసం షర్టు తీయాలన్నారు .. అవసరం లేదండి అని చెబుతున్నా వినిపించుకోలేదు. ఆ పాటలో ఫిట్ నెస్ కనిపించాలని నాతో కసరత్తులు చేయించారు .. షర్టు తీయించారు. అవినాశ్ కొల్లా గారి సెట్ .. శోభి మాస్టర్ గారి కొరియోగ్రఫీ వలన ఆ సాంగ్ మరింత అద్భుతంగా వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.  

More Telugu News