poco: పోకో నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే !

  • ట్రిపుల్ రియర్ కెమెరా.. ప్రధాన కెమెరా సామర్థ్యం 108 ఎంపీ
  • ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఈ నెల 13 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు
  • ఐసీఐసీఐ కార్డుతో రూ.2 వేలు డిస్కౌంట్ ఆఫర్
POCO x5 pro has been announced in india a 108 mega pixel camera new smartphone

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ పోకో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. పోకో ఎక్స్ 5 గా వ్యవహరిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. తక్కువ ధరకే 5జి ఫోన్ ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఫోన్ లో మూడు కెమెరాలను అమర్చామని, ప్రధాన కెమెరాను 108 మెగా పిక్సెల్ సామర్థ్యంతో తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. 

ఇక ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉందని తెలిపింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 22,999 కాగా, 8 జీబీ ర్యామ్, 256 మెమరీ వేరియంట్ ను రూ.24,999 లకు సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ ఖాతాదారులు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేలు డిస్కౌంట్ పొందొచ్చని వివరించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..

  • 1080×2400 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ అమో లెడ్ డిస్‌ప్లే
  • 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డిఆర్ 10 సపోర్ట్, డాల్బీ వెర్షన్ 10 బిట్ సపోర్ట్
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778G SoC ప్రాసెసర్‌
  • ట్రిపుల్ రియర్ కెమెరా (108 మెగా పిక్సెల్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో లెన్స్)
  • 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా
  • 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News