శోభన్ బాబుగారి వల్లనే నన్ను నేను మార్చుకున్నాను: నటి కుట్టి పద్మిని

  • బాలనటిగా పాప్యులర్ అయిన కుట్టి పద్మిని
  • అప్పట్లో తనకి గల గుర్తింపు గురించి ప్రస్తావన  
  • జయలలితతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేదని వ్యాఖ్య 
  • ఆమెతో కలిసి సినిమాలకు వెళ్లేదానినని వెల్లడి
Kutty Padmini Interview

'కోడి ఒక కోనలో .. పుంజు ఒక కోనలో ' అనే పాట వినగానే, 'లేత మనసులు' సినిమాలోని కుట్టి పద్మిని ఫేస్ గుర్తొస్తుంది. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె చాలా బిజీ. అలనాటి స్టార్ హీరోలందరి సినిమాల్లోను కూతురుగా ఆమె నటించారు. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె అనేక సినిమాలలో నటించారు. 

తాజా ఇంటర్వ్యూలో కుట్టి పద్మిని మాట్లాడుతూ .. "తమిళ ఇండస్ట్రీలో నేను జయలలితగారితో ఎక్కువ సాన్నిహిత్యంతో ఉండేదానిని. ఆమెతో కలిసి దాదాపు 19 సినిమాల వరకూ చేశాను. షూటింగులు లేకపోతే జయలలితగారు .. నేను కలిసి సినిమాలకి వెళ్లే వాళ్లం. ఆమె మాత్రం ముసుగు ధరించి నాతో పాటు వచ్చేది" అని అన్నారు. 

ఇక హీరోల్లో నేను ఎక్కువగా శోభన్ బాబు గారితో చనువుగా ఉండేదానిని. చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తూ రావడం వలన నేను చదువుకోలేదు. చదువుకోకపోయినా ఎలా పైకి రావొచ్చుననే విషయాలను నాకు శోభన్ బాబు గారు చెప్పేవారు. ఆడపిల్లలు ఖాళీగా ఇంటిపట్టునే ఉండకుండా తమని తాము ఎలా డెవలప్ చేసుకోవాలనేది వివరించేవారు. ఆయన మాటలనే నేను ఆచరణలో పెడుతూ వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News