ముంబయి బిజినెస్ మేన్ ను పెళ్లాడిన 'నేనింతే' హీరోయిన్

  • 2008లో వచ్చిన రవితేజ 'నేనింతే'
  • కథానాయికగా ఆకట్టుకున్న శియా గౌతమ్
  • ముంబయికి చెందిన మిఖాయిల్ పాల్కీవాలాతో పెళ్లి
  • వీడియో పోస్టు చేసిన శియా గౌతమ్
Siya Gautam weds Mumbai businessman

పదిహేనేళ్ల కిందట తెలుగులో వచ్చిన 'నేనింతే' చిత్రంలో రవితేజ సరసన మెరిసిన శియా గౌతమ్ ఇప్పుడు ఓ ఇంటిదైంది. ముంబయికి చెందిన మిఖాయిల్ పాల్కీవాలా అనే బిజినెస్ మేన్ తో శియా పెళ్లి సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ విషయం మీడియా కంటే ముందు సోషల్ మీడియాకు తెలిసింది. అది కూడా శియా గౌతమ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించడంతో పెళ్లి విషయం బయటికి వచ్చింది. 

పెళ్లి ఎక్కడ జరిగిందన్న వివరాలను శియా పంచుకోకపోయినా, పెళ్లి ఎలా జరిగిందన్న వివరాలతో ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో, శియా, పాల్కీవాలా జంటపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

More Telugu News