Nara Lokesh: చిత్తూరులో ఓ సచివాలయంలోకి ఎంటరైన నారా లోకేశ్... నేటి పాదయాత్ర హైలైట్స్!

  • చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం 
  • 12వ రోజు ముగిసిన పాదయాత్ర
  • జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ యువనేత
  • ప్యాలెస్ పిల్లి అంటూ ఎద్దేవా
  • ఒక్క చాన్స్ ఇస్తే సర్వనాశనం చేశాడని విమర్శలు
Nara Lokesh enters into a secretariat in Chittoor

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. నేటి పాదయాత్ర ప్రారంభానికి ముందు చిత్తూరు కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన సభలో లోకేశ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ మోసపు రెడ్డీ... నీ పని అయిపోయింది... వచ్చేది తెలుగుదేశం పార్టీయే అని స్పష్టం చేశారు. 

ఎన్నికలు అయిపోయాక నువ్వు ఇంటి నుంచి ఎలా బయటికి వస్తావో చూస్తా... నీకు భయం ఎలా ఉంటుందో రుచిచూపిస్తా అని వ్యాఖ్యానించారు. ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు అని మండిపడ్డారు. "ప్యాలెస్ పిల్లి పరదాలు కట్టుకుని తిరుగుతోంది... ప్రజాదరణ ఉంది కాబట్టే మనం పబ్లిక్ గా తిరగ్గలుగుతున్నాం. ప్రజల ఆశీస్సులతో యువగళం పాదయాత్ర చేయగలుగుతున్నాం. నా ప్రచార రథంతో పాటు మైక్ ను కూడా సీజ్ చేశారు. టీడీపీ అంటే నీకు ఎందుకంత భయం జగన్ రెడ్డీ...?" అని ప్రశ్నించారు.

లోకేశ్ ప్రసంగం ముఖ్యాంశాలు...

  • టీడీపీకి మద్దతిస్తున్నారన్న కక్షతో విద్యార్థులపై హత్యాయత్నం కేసులు పెట్టారు.
  • తప్పుడు మార్గంలో వెళుతూ చట్టాలు ఉల్లంఘిస్తున్న పోలీసు అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాం. 
  • గతంలో లోటు బడ్జెట్ లోనూ చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు.
  • బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు
  • రాష్ట్రం పురోగామి పథంలో దూసుకెళుతున్న సమయంలో వచ్చి ఒక్క చాన్స్ అడిగి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి జగన్

  • మోసానికి మరో రూపం జగన్... కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. 
  • ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని మోసం చేశాడు.
  • సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి, కల్తీ మద్యం పారిస్తున్న మోసగాడు జగన్
  • చిత్తూరును తాగునీటి సమస్య వెంటాడుతోంది. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోనే చిత్తూరు తాగునీటి పథకం పూర్తి చేస్తాం.
  • అడవిపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైనుకు నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థితిలో లేదు.
  • మహావీర్ బ్రిడ్జికి చంద్రబాబు నిధులు కూడా కేటాయించారు. కానీ ఈ ఎమ్మెల్యే వాటాలు అడగడం వల్ల ఆ పనులు కూడా ఆగిపోయాయి. 
  • చిత్తూరు కేంద్రంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
  • చిత్తూరు జిల్లా వాసుల కల చిత్తూరు యూనివర్సిటీని కూడా చంద్రబాబు నెరవేరుస్తారు... అందుకు నేను హామీ ఇస్తున్నా.

లోకేశ్ పాదయాత్ర ఇలా సాగింది...

  • చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ లో అన్నా క్యాంటీన్ ను మూసివేసి సచివాలయం ఏర్పాటు చేసిన వైనాన్ని పరిశీలించిన లోకేశ్ 
  • సచివాలయ సిబ్బంది అనుమతి తీసుకుని లోపలికి వెళ్లిన లోకేశ్ 
  • స్థానికంగా ఉన్న పరిస్థితులపై సచివాలయ సిబ్బందిని లోతుగా ప్రశ్నించే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు 
  • టీడీపీ నేతల ప్రయత్నాన్ని అడ్డుకున్న లోకేశ్ 
  • మనం ఈ పిల్లలతో మాట్లాడామని తెలిస్తే సైకో జగన్ రెడ్డి వారి ఉద్యోగాలు తీసేస్తాడని టీడీపీ నేతలకు సర్దిచెప్పిన లోకేశ్ 
  • అన్నా క్యాంటీన్లు మూసివేసిన పాపం జగన్ ను వెంటాడుతుందని స్పష్టీకరణ 
  • చిత్తూరు పట్టణంలోని పెట్రోల్ బంకులో రేట్ల పరిశీలన 
  • పెట్రోల్ బంకులోని ధరల పట్టికను ప్రజలకు చూపించి పన్నులు పెంచి ఎలా దోపిడీ చేస్తున్నదీ వివరించిన లోకేశ్ 

లోకేశ్ పాదయాత్ర వివరాలు

ఇప్పటివరకు నడిచిన దూరం: 145.9 కిలోమీటర్లు
నేడు 12వ రోజు (7-2-2023) నడిచిన దూరం: 6.1 కిలోమీటర్లు
..............................................................................
యువ‌గ‌ళం పాద‌యాత్ర 13వ రోజు (8-02-2023) బుధవారం షెడ్యూల్‌ వివరాలు

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం 8.00– దిగువమాసపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.45– అయ్యనవేడు గ్రామస్తులతో సమావేశం
11.45– అరదలలో యువతీయువకులతో ముఖాముఖి
12.00– అరదలలో భోజన విరామం
1.00– అరదలలో రైతులతో సమావేశం
2.00 – అరదల నుంచి పాదయాత్ర కొనసాగింపు
సాయంత్రం 5.30– జి.డి. నెల్లూరు నియోజకవర్గంలో ప్రవేశం, ముత్యాలమ్మతల్లి  గుడి ప్రాంగణం విడిది కేంద్రంలో బస.

More Telugu News