'వీరసింహారెడ్డి' పాత్ర గురించి వినగానే, శివరాజ్ కుమార్ లుక్ గుర్తొచ్చింది: బాలయ్య

  • కన్నడలో హిట్ కొట్టిన 'వేద'
  • తెలుగులో ఈ నెల 9న విడుదల 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హిట్ ఖాయమని చెప్పిన బాలకృష్ణ 
Vedha pre release event

కన్నడలో శివ రాజ్ కుమార్ 'వేద' సినిమాను చేశారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, అక్కడ ఘనవిజయాన్ని సాధించింది. దాంతో తెలుగులో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ కి ఇది 125వ సినిమా. అందువలన సంఖ్యా పరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులో బాలయ్య చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై బాలయ్య మాట్లాడుతూ .. "కన్నడ .. తెలుగు భాషల మాదిరిగానే మా మధ్య మంచి అనుబంధం ఉంది. రాజ్ కుమార్ గారి వారసత్వాన్ని ఎంతో బాధ్యతగా శివ రాజ్ కుమార్ గారు ముందుకు తీసుకుని వెళుతున్నారు. అది ఆ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు " అని అన్నారు. 


"శివ రాజ్ కుమార్ గారు ఇంతకుముందు 'మఫ్టీ' అనే ఒక సినిమా చేశారు. 'వీరసింహారెడ్డి'లో ఓల్డ్ లుక్ ఎలా ఉండాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు 'మఫ్టీ' సినిమాలోని శివరాజ్ కుమార్ గారి లుక్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఫొటోలను తెప్పించాను. ఇక ఈ సినిమాలో గానవి .. అదితి సాగర్ చాలా బాగా చేశారు. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కుదిరాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News