మీకు అంతగా నచ్చితే విశాఖకు వీకెండ్ వెళ్లండి: రఘురామకృష్ణ రాజు

  • త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానంటూ సీఎం ప్రకటన
  • సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందన్న వైసీపీ నేతలు
  • జగనన్న విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందన్న రఘురామ
  • రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని వెల్లడి
Raghurama comments on CM Jagan and Visakha

త్వరలోనే తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నానంటూ ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటించగా, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. జగనన్న విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని అన్నారు. సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాజు ఎక్కడుంటే అదే రాజధాని కాదని రఘురామ వ్యాఖ్యానించారు. 

సీఎం మాట్లాడిన రెండ్రోజులకే ఆయన తమ్ముడిని సీబీఐ ప్రశ్నించిందని అన్నారు. రేపో మాపో మరికొందరికి సీబీఐ నోటీసులు అందే అవకాశం ఉందని తెలిపారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. 

ఇక, కోర్టు తీర్పు వచ్చే వరకు రాజధానిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. మీకు అంతగా నచ్చితే విశాఖకు వీకెండ్ వెళ్లండి అంటూ జగన్ కు సలహా ఇచ్చారు.

More Telugu News