తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

  • మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్
  • మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష
  • మే 18న ఎడ్ సెట్
Telangana EAMCET schedule

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షల తేదీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష... మే 18న ఎడ్ సెట్,మే 20న ఈసెట్, మే 25న లాసెట్, పీజీఎల్ సెట్, మే 26న ఐసెట్, మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. 

More Telugu News