పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'పర్‌ఫ్యూమ్'

  • చేనాగ్, ప్రాజీ థాకర్ జంటగా పర్ ఫ్యూమ్
  • రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం
  • అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించామన్న మేకర్స్
Perfume movie finished pre production works

చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన రొమాంటిక్ మూవీ 'పర్ ఫ్యూమ్' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తొలుత ఈ చిత్రానికి మేకర్స్ 'వేద' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే రొమాంటిక్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కావడంతో ఈ చిత్రం పేరును 'పర్ ఫ్యూమ్'గా మార్చారు. 

ఈ చిత్రాన్ని జేడీ స్వామి తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను రూపొందించామని దర్శకనిర్మాతలు తెలిపారు. సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్, శ్రీనివాస్ లావూరి, రాజేందర్ కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని కలిసి నిర్మించారు. 

More Telugu News