Team India: టీమిండియా-ఆస్ట్రేలియా టెస్టు, వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదిగో!

  • ఫిబ్రవరి 9 నుంచి భారత్ లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన
  • 4 టెస్టులు, 3 వన్డేలతో భారీ షెడ్యూల్
  • ఫేవరెట్ గా బరిలో దిగుతున్న టీమిండియా
Full schedule of Australia tour in India

ఈ నెల 9 నుంచి భారత్ లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన షురూ కానుంది. ఒకటిన్నర నెల పాటు ఈ పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 4 టెస్టులు, 3 వన్డేలు జరగనున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే తొలి టెస్టుకు నాగపూర్ వేదిక కానుంది. టెస్టుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ టెస్టు సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంటే ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లభిస్తుంది. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ టీ20, వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియానే నెం.1 స్థానంలో ఉంది. ఆసీస్ తో టెస్టు సిరీస్ కూడా నెగ్గితే ఐదు రోజుల ఫార్మాట్లోనూ అగ్రపీఠం భారత్ వశమవుతుంది.


టీమిండియా, ఆసీస్ మధ్య మ్యాచ్ ల వివరాలు

తొలి టెస్టు- ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు (నాగపూర్)
రెండో టెస్టు- ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు (ఢిల్లీ)
మూడో టెస్టు- మార్చి 1 నుంచి 5 వరకు (ధర్మశాల)
నాలుగో టెస్టు- మార్చి 9 నుంచి 13 వరకు (అహ్మదాబాద్)

తొలి వన్డే- మార్చి 17 (ముంబయి)
రెండో వన్డే- మార్చి 19 (విశాఖపట్నం)
మూడో వన్డే- మార్చి 22 (చెన్నై)

చివరిసారిగా భారత్-ఆసీస్ మధ్య 2020-21లో టెస్టు సిరీస్ జరగ్గా... 2-1తో భారత్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ సిరీస్ భారత టెస్టు చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. అంతకుముందు, 2018-19లో 2-1తోనూ... 2016-17లో 2-1తోనూ ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ లను కైవసం చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో, సొంతగడ్డపై జరగనున్న 4 టెస్టుల సిరీస్ లోనూ టీమిండియానే ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.

More Telugu News