జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తెలుగు విద్యార్థుల హవా

  • గత నెలలో 24 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
  • ఈ నెల 1న కీ విడుదల
  • తాజాగా 20 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్
  • వారిలో పలువురు తెలుగు విద్యార్థులు
JEE Main 2023 results released

జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు గత నెల 26న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ మెయిన్స్ లో 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వారిలో పలువురు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. 

అభినవ చౌదరి, మాజేటి అభినీత్, దుగ్గినేని యోగేశ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి, గుత్తికొండ అభిరామ్ 100 పర్సంటైల్ సాధించారు. కాగా, 100 పర్సంటైల్ సాధించిన 20 మందిలో 14 ఓసీ, నలుగురు ఓబీసీ, ఒకరు ఎస్సీ విద్యార్థి కాగా, మరొకరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవారు. 

జేఈఈ మెయిన్స్ తొలి సెషన్ పరీక్షల కీ ఈ నెల 1న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీని సోమవారం విడుదల చేశారు. గత నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 8.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

More Telugu News