'అమిగోస్' అసలు కథ అక్కడే మొదలవుతుంది: డైరెక్టర్ రాజేంద్ర

  • డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'అమిగోస్'
  • దర్శకుడిగా రాజేంద్రకి ఇదే మొదటి సినిమా 
  • ఈ కథ అలా పుట్టిందంటూ వివరణ 
  • ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న సినిమా
Rajendra Interview

కల్యాణ్ రామ్ తన కెరియర్ లో కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ వెళుతున్నాడు. 'పటాస్'తో అనిల్ రావిపూడిని .. 'బింబిసార'తో వశిష్ఠను దర్శకులుగా పరిచయం చేసిన ఆయన, 'అమిగోస్' సినిమాతో రాజేంద్రకి ఛాన్స్ ఇచ్చాడు. మైత్రీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రాజేంద్ర మాట్లాడుతూ .. "ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటూ ఉంటాము. అలాంటివారిలో ఒక ముగ్గురు కలుసుకుంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో ఈ కథకు బీజం పడింది. కథను పూర్తిచేసిన తరువాత దీనికి కల్యాణ్ రామ్ కరెక్ట్ అనిపించడంతో ఆయనను కలిశాను" అన్నాడు. 

" ఈ సినిమాలో వేరు వేరు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు కలుసుకుంటారు. ఒకరు తెలుగు .. మరొకరు కన్నడ .. ఇంకొకరు హిందీ భాషలను మాట్లాడతారు. ముగ్గురూ కూడా మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత వారి మధ్య ఒక సమస్య తలెత్తుతుంది. అదేమిటి? .. దానికి కారకులు ఎవరు? పరిష్కారం ఏమిటి? అనేదే కథ అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News