ఇంతకంటే బాధాకరం మరొకటి ఉండదు: విరాట్ కోహ్లీ

  • తన ఫోన్ పోయిందంటూ కోహ్లీ ట్వీట్
  • బాక్స్ తీయకుండానే ఫోన్ పోతే అలాంటి బాధ మరొకటి ఉండదేమోనని వ్యాఖ్య
  • కోహ్లీ ట్వీట్ పై జొమాటో ఆసక్తకర ట్వీట్
Virat  Kohli lost his phone

తన ఫోన్ పోయిందంటూ టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాక్స్ నుంచి ఫోన్ తీయకుండానే ఆ ఫోన్ పోతే ఆ బాధాకరమైన ఫీలింగ్ మరొకటి ఉండదేమోనని కోహ్లీ చెప్పారు. తన ఫోన్ ను మీలో ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. 

మరోవైపు కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు సరదాగా స్పందిస్తున్నారు. ఇదేదో కొత్త యాడ్ లా ఉందని కొందని వ్యాఖ్యానించారు. టెస్ట్ సిరీస్ కు ముందు కోహ్లీని ఒత్తిడికి గురి చేయవద్దని మరికొందరు అన్నారు. 

ఇదే సమయంలో ఫుడ్ డెలివరీ యాప్ కూడా స్పందించింది. వదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్ ను ఆర్డర్ చేసేందుకు మొహమాట పడొద్దని జొమాటో కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం కోహ్లీ రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

More Telugu News