బెదిరింపు కాల్ తో ముంబై ఎయిర్ పోర్ట్ లో భద్రత అప్రమత్తం

  • ఇండియన్ ముజాహిదీన్ గ్రూపు సభ్యుడి నుంచి కాల్
  • దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
  • విచారణ మొదలు పెట్టిన పోలీసులు
Mumbai airport put on alert after threat from terror group

ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దాడికి పాల్పడతామంటూ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) నుంచి వచ్చిన బెందిరింపులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తన పేరు ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అని, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద గ్రూపు సభ్యుడినని కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్టు తెలిపాయి. 

దీంతో విమానాశ్రయం సిబ్బంది ఈ బెదిరింపు కాల్ పై ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో విమానాశ్రయంలోని అన్ని అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. సహర్ పోలీసులు సెక్షన్ 505(1) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. ప్రజలకు హాని చేసే ఉద్దేశ్యంతో ఉద్దేపూర్వకంగా చేసే ప్రచారం, వందతుల వ్యాప్తి ఈ చట్టం కిందకు వస్తాయి. ముంబై విమానాశ్రయాన్ని గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ నిర్వహిస్తుండడం గమనార్హం. 


More Telugu News