మంటల్లో చిక్కుకున్న నన్ను ఆ హీరో కాపాడాడు: విజయశాంతి

  • యాక్షన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి
  • డూప్ లేకుండా ఫైట్స్ చేశానని చెప్పిన శాంతి  
  • 'లేడీ బాస్' షూటింగులో ప్రమాదం జరిగిందని వెల్లడి 
  • తమిళ సినిమా షూటింగులో విజయ్ కాంత్ కాపాడారని వివరణ
Vijayashanthi Interview

విజయశాంతికి ఉన్న క్రేజ్ వేరు .. ఆమె చేస్తూ వెళ్లిన పాత్రలు వేరు. ఒకానొక దశలో హీరోలతో సమానమైన యాక్షన్ సీన్స్ ను డూప్ లేకుండా చేసిన హీరోయిన్ ఆమె. ఎలాంటి గ్రాఫిక్స్ లేని ఆ సమయంలో తాను రియల్ ఫైట్స్ చేసినట్టుగా తాజా ఇంటర్వ్యూలో విజయశాంతి చెప్పారు. 'లేడీబాస్' సినిమాలో నేను చేసిన ఫీట్ కి ఫైట్ మాస్టర్ సైతం భయపడిపోయాడు" అని అన్నారు. 

"ఇక ఒక సినిమా షూటింగులో ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను, మరో సినిమా షూటింగులో మంటల్లో చిక్కుకున్నాను. అది ఒక తమిళ సినిమా .. అందులో విజయ్ కాంత్ హీరో. ఫారెస్టు నేపథ్యంలోని ఒక గుడిసెలో నన్ను కట్టేసి .. గుడిసెను తగులబెట్టాలి. గుడిసెను అంటించే సమయానికి ఒక్కసారిగా పెద్దగాలి వచ్చింది .. దాంతో ఒక్కసారిగా గుడిసె అంతా అంటుకుంది" అని చెప్పారు.  

గుడిసెలో లోపల నన్ను కట్టేసి ఉంచారు. ఒక వైపున సిల్క్ చీర .. మరో వైపున నా జుట్టు కాలిపోతున్నాయి. ఏం చేయాలో తోచకపోవడంతో కాపాడటానికి ఎవరూ రావడం లేదు. అప్పుడు ఒక్కసారిగా విజయ్ కాంత్ గారు వచ్చారు. ఆయన ఏం చేశాడో తెలియదుగానీ నన్ను ఆ ప్రమాదంలో నుంచి బయటపడేశారు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News