Rakhi Sawant: రాఖీ సావంత్ ఫిర్యాదు.. భర్త ఆదిల్ ఖాన్ అరెస్ట్

Rakhi Sawants husband Adil Khan Durrani arrested after her police complaint amid affair allegations
  • తన నిధులు దుర్వినియోగం చేశాడని, మోసం చేశాడని ఆరోపిస్తున్న రాఖీ 
  • ఆమెను కలిసేందుకు వచ్చిన సందర్భంగా అరెస్ట్ చేేసిన పోలీసులు
  • అన్ని ఆధారాలను సమర్పించానన్న రాఖీ సావంత్
రాఖీ సావంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఆమె భర్త ఆదిల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆదిల్ తన నిధులను దుర్వినియోగం చేశాడంటూ ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గతేడాది మరాఠీలో బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన అమ్మ జయా జశ్వంత్ ఆరోగ్యం చూసుకోవాలని అతనిని కోరినట్టు ఆమె పేర్కొంది. అయినప్పటికీ అమ్మ సర్జరీకి సకాలంలో డబ్బులు ఆదిల్ చెల్లించలేదని, ఆమె మరణానికి అతడే కారణమని ఆరోపించింది. 

ఆదిల్ ఖాన్ అరెస్ట్ ను రాఖీ సావంత్ మంగళవారం ప్రకటించింది. తనను కలిసేందుకు ఇంటికి వచ్చిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ‘‘ఇది డ్రామా కాదు. అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను కొట్టి నా డబ్బులు దోచుకెళ్లాడు. ఖురాన్ పైనా ప్రమాణం చేశాడు. అయినా నన్ను మోసం చేశాడు’’ అని రాఖీ సావంత్ పేర్కొంది. పోలీసులు వాస్తవాన్ని గుర్తించేందుకు వీలుగా కావాల్సిన అన్ని ఆధారాలను సమర్పించినట్టు రాఖీ సావంత్ తెలిపింది. ఆదిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను మోసం చేస్తున్నట్లు రాఖీ గత వారం కూడా ఆరోపించడం గమనార్హం.
Rakhi Sawant
Adil Khan Durrani
arrested
mumbai police

More Telugu News