కల్యాణ్ రామ్ కోసం 'అమిగోస్' డైరెక్టర్ ఏడాదిపాటు తిరిగాడట!

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'అమిగోస్'
  • దర్శకుడిగా రాజేంద్ర రెడ్డి పరిచయం 
  • ఆయన ఓపికను గురించి ప్రస్తావించిన కల్యాణ్ రామ్ 
  • ఆయనను చూసే ఒక పాత్రను డిజైన్ చేశామని వెల్లడి 
  • ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానున్న సినిమా  
Amigos movie update

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'అమిగోస్' సినిమా, ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మనిషిని పోలిన మనుషులు తారసపడితే ఎలా ఉంటుందనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను మైత్రీ వారు నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడిగా రాజేంద్రరెడ్డి పరిచయమవుతున్నాడు. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "రాజేంద్ర రెడ్డిగారు 2016 నుంచి 2017 వరకూ నా కోసం ప్రతిరోజు ఆఫీసుకి వచ్చేవారట. కల్యాణ్ రామ్ ను కలవాలి .. కథ చెప్పాలి అని హరితో అనేవారట. నేను చాలా బిజీగా ఉన్నానని హరి ఎన్నిసార్లు చెప్పినా రాజేంద్రరెడ్డి వినిపించుకోలేదట .. తానే ఈ విషయం నాకు చెప్పాడు" అన్నాడు. 

"2020లో మళ్లీ వచ్చి నాకు 'అమిగోస్' అనే ఈ కథను చెప్పారు. ఆయన ఎంత ఓపికతో వెయిట్ చేస్తారనేది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన చాలా కామ్ గా ఉంటారు .. కాస్త బిడియస్తుడు కూడా .. నిదానంగా మాట్లాడతారు. ఆ మేనరిజమ్స్ నే ఈ సినిమాలో 'మంజునాథ్' అనే నా పాత్రకి ఉండేలా చూసుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News