Vijayashanti: నా పారితోషికం ఎక్కడి నుంచి ఎక్కడివరకూ వెళ్లిందంటే..!: విజయశాంతి

Vijayashanthi Interview
  • నిన్నటితరం హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి 
  • తాను అందుకున్న తొలి పారితోషికం 3 వేలు అట!
  • కోటి రూపాయల వరకూ తీసుకున్నానని వెల్లడి 
  • తన గ్రాఫ్ పెరిగేలా చేసిన డైరెక్టర్స్ గురించిన ప్రస్తావన 
కథానాయికగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విజయశాంతి, రాజకీయాలలో తన ప్రభావం చూపుతూ వెళుతున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ .. " నా చిన్నతనంలోనే అమ్మానాన్న పోయారు. అప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూ వెళుతున్నాను" అన్నారు. 

"ఇంతవరకూ నేను 5 భాషల్లో కలుపుకుని 180కి పైగా సినిమాల్లో చేశాను. ఆ జాబితాలో 'కర్తవ్యం' .. 'ప్రతిఘటన' .. 'ఒసేయ్ రాములమ్మా' అంటే నాకు చాలా ఇష్టం. టి.కృష్ణగారు .. దాసరి నారాయణరావు గారు .. మోహన్ గాంధీ గారు .. కోడి రామకృష్ణగారు నా కెరియర్ గ్రాఫ్ ను పెంచుతూ వెళ్లారు" అని చెప్పారు.  

"నా ఫస్టు సినిమాకి నేను మాట్లాడుకున్న రెమ్యునరేషన్ 5 వేలు. 3 వేలు ఇచ్చి 2 వేలు ఎగ్గొట్టారు. అక్కడి నుంచి నేను కోటి రూపాయల పారితోషికం తీసుకునేవరకూ వెళ్లాను. అప్పట్లో అమితాబ్ .. రజనీ తరువాత అత్యధిక పారితోషికం అందుకున్నది నేనే. ఆ విషయాన్ని ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది కూడా" అని చెప్పుకొచ్చారు.
Vijayashanti
Actress
Tollywood

More Telugu News