ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమాలు ఇవే.. వాల్తేరు వీరయ్య కూడా!

  • ఓటీటీ సెంటర్లో వరుస సినిమాలు 
  • రేపటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 'తునీవు' స్ట్రీమింగ్
  • ఈ నెల 9 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో 'రాజయోగం'
  • 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'హంట్'
  • ఈనెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్
New Films in OTT

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై వరుసగా సినిమాలు సందడి చేయనున్నాయి. ఈనెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ కానుంది. అంతకంటే ముందు ఈ వారంలో 3 సినిమాలు పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో టెలికాస్ట్ కానున్నాయి.

అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన 'తునీవు' (తెగింపు) సినిమాను బోనీ కపూర్ నిర్మించగా, హెచ్ వినోత్ దర్శకత్వం వహించాడు. జనవరి 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. 

ఇక చిన్న సినిమాగా నిర్మితమైన 'రాజయోగం' .. క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. సాయి రోనక్ - అంకిత సాహ జంటగా నటించిన ఈ సినిమా కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. 

సుధీర్ బాబు హీరోగా నటించిన 'హంట్' జనవరి 26వ తేదీన థియేట్రికల్ రిలీజ్ ను జరుపుకుంది. శ్రీకాంత్ - భరత్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై విడుదలైంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య.. సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు సినిమా హాళ్లలో హంగామా సృష్టించిన ఈ సినిమా.. ఇక ఓటీటీలోనూ సందడి చేయనుంది. వాల్తేరు వీరయ్య ఓటీటీ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడనేది ప్రకటించేసింది. ఈనెల 27 నుంచి సినిమాను టెలికాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేసింది.

More Telugu News