జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
- విశాఖ నుంచే పాలన సాగుతుందని జగన్ ఇటీవల ప్రకటన
- బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి ఇల్లు
- ఇళ్లు వెతుక్కుంటున్న మంత్రులు
వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలోనే విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. ఆ తర్వాతి నుంచే విశాఖలో పనులు వేగం పుంజుకున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.