బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన 'వేద'
  • యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 7న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 9వ తేదీన సినిమా రిలీజ్    
Vedha pre release event

శివరాజ్ కుమార్ హీరోగా కన్నడలో 'వేద' సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. కన్నడలో క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. 

తెలుగులో కూడా ఈ సినిమా అదే టైటిల్ తో వస్తోంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆషామాషీగా ఈ సినిమాను తెలుగులో వదిలేయడం లేదు. ఈ నెల 7వ తేదీన గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంటును ఏర్పాటు చేస్తున్నారు. 

బాలయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, హైదరాబాద్ లోని 'దసపల్లా' హోటల్లో ఈ ప్రీ రీలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. భారీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News