తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ స్పందన

  • బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావు
  • రూ.2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
  • అంతా అంకెల గారడీ అన్న సంజయ్ 
  • అంతా వట్టిదే... డబ్బా బడ్జెట్ అని విమర్శలు 
Bandi Sanjay reacts on Telangana budget

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరవైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగారి మాటల్లో చెప్పాలంటే... సరుకు లేదు, సంగతి లేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంతా వట్టిదే... డబ్బా బడ్జెట్... బభ్రాజమానం భజగోవిందం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News