Renuka Chowdary: అవసరమైతే గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తా: రేణుకా చౌదరి

Renuka Chowdary says if needed she will contest from Gidivada
  • తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు బాధాకరమన్న రేణుక 
  • ఇన్చార్జి వచ్చి పరిష్కరిస్తుండడం పట్ల సిగ్గుపడుతున్నట్టు వెల్లడి
  • ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానన్న ఫైర్ బ్రాండ్
  • గుడివాడలో పోటీ చేయాలన్న ఆహ్వానం ఉందని వివరణ
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు బాధాకరమని, పార్టీ ఇన్చార్జి వచ్చి గొడవలు పరిష్కరించాల్సి రావడం పట్ల సిగ్గుపడుతున్నానని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని రేణుకా చౌదరి వెల్లడించారు. రేవంత్ ను ఖమ్మం ఆహ్వానిస్తామని చెప్పారు. 

ఇక, పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి వెల్లడించారు. తనకు ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీచేయాలన్న ఆహ్వానం ఉందని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని చెప్పారు. 

ఎక్కడా దిక్కులేని వాళ్లు చేరేది కాంగ్రెస్ పార్టీలోనే అని వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరే విషయం కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే చూసుకుంటారని వెల్లడించారు.
Renuka Chowdary
Gudivada
Khammam
Congress
Telangana

More Telugu News