Anikha Surendran: 'బుట్టబొమ్మ' (మండే టాక్)

  • అనిఖ సురేంద్రన్ టైటిల్ రోల్ పోషించిన 'బుట్టబొమ్మ'  
  • టీనేజ్ లవ్ స్టోరీ అనుకున్న యూత్ 
  • కథ వేరే ట్రాక్ లో నడవడంపట్ల అసంతృప్తి
  • సందేశాన్ని పట్టించుకోని తీరు 
  • ఆడపిల్లలు తప్పక చూడాలంటున్న ఫ్యామిలీ ఆడియన్స్
Buttabomma Monday Talk

సితార బ్యానర్లో సినిమా వస్తుందంటే అందులో తప్పకుండా విషయం ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందువలన తప్పకుండా ఆ సినిమాను చూడటానికే వాళ్లు ప్రయత్నిస్తుంటారు. అలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన మరో చిన్న సినిమానే 'బుట్టబొమ్మ'. చంద్రశేఖర్ టి.రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను అనిఖ సురేంద్రన్ పోషించింది. మిగతా రెండు ముఖ్యమైన పాత్రలలో సూర్య వశిష్ఠ .. అర్జున్ దాస్ కనిపిస్తారు. 

'బుట్టబొమ్మ' సినిమాలో హీరోయిన్ అనిఖకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలుగులో ఇంత త్వరగా సినిమా చేయడం పట్ల అభిమానులు ఖుషీ అయ్యారు. తొలి రోజునే థియేటర్ల దగ్గర యూత్ హడావిడి ఎక్కువగా కనిపించింది. సినిమా చూసిన తరువాత, కథాకథనాలు  ... పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. ఆశించిన స్థాయిలో లేవనీ, నిడివి కూడా చాలా తక్కువగా ఉందంటూ చాలామంది పెదవి విరిచారు. 

ఇక ఈ రోజున పరిస్థితి చూసుకుంటే ఈ సినిమా టాక్ లో పెద్ద మార్పు కనిపించడం లేదు. టీనేజ్ లవ్ స్టోరీ అనుకుని థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ను 'బుట్టబొమ్మ' నిరాశ పరిచిందనీ, ఇది ప్రేమకథ కాదు అనే ఒక విషయాన్ని ముందుగా ఆడియన్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేదనే టాక్ థియేటర్ల దగ్గర వినిపిస్తోంది. 

ప్రస్తుతం ఆడపిల్లలు ఎదుర్కునే సమస్యను ఒక మెసేజ్ గా చెప్పారనీ, అందువలన ఆడపిల్లలు తప్పకుండా చూడాలనే అభిప్రాయాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ .. క్లైమాక్స్ బాగున్నాయిగానీ, అంతకుముందు నుంచి కథను పకడ్బందీగా అల్లుకుంటూ రావలసిందని అంటున్నారు. అనిఖ .. అర్జున్ దాస్ మినహా బలమైన ఆర్టిస్టులను సెట్ చేయకపోవడం మరో లోపంగా చెబుతున్నారు. స్క్రీన్ లోపం ప్రధానంగా కనిపిస్తుందని అంటున్నారు. 'బుట్టబొమ్మ' టీనేజ్ లవ్ స్టోరీ కాదు అని తెలిశాక, యూత్ ను థియేటర్స్ దిశగా నడిపించడం కష్టమేమరి!

More Telugu News