25 రోజులను పూర్తిచేసుకున్న 'వాల్తేరు వీరయ్య'

  • జనవరి 13వ తేదీన వచ్చిన 'వాల్తేరు వీరయ్య'
  • నేటితో 25 రోజుల ప్రదర్శన పూర్తి 
  • మెగా మూవీకి ఇంతవరకూ లేని పోటీ
  • మరిన్ని వసూళ్లను రాబట్టే ఛాన్స్
Waltair Veerayya movie update

చిరంజీవి - బాబీ కాంబినేషన్లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రవితేజ కీలకమైన పాత్రను పోషించాడు. ఈ పాత్రను సెకండాఫ్ లో ప్రవేశపెట్టడం వలన, అక్కడి నుంచి ఆడియన్స్ ఆశించిన స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. 

ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సరికొత్త పోస్టర్ ను వదిలారు. సంక్రాంతి తరువాత చాలానే సినిమాలు వచ్చినప్పటికీ, 'వాల్తేరు వీరయ్య'కి పోటీగా నిలిచే స్థాయి సినిమాలు రాలేదు. 

అందువలన ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే వెళుతోంది. ఈ నెల 17వ తేదీన 'శాకుంతలం' విడుదల కానుంది. అప్పటివరకూ కూడా వీరయ్య హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి తరహా మాస్ మార్క్ .. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పచ్చు.

More Telugu News