తాతగారు చేసిన ఆ మూడు సినిమాల్లో ఒకటి రీమేక్ చేయాలనుంది: కల్యాణ్ రామ్

  • ఈ నెల 10వ తేదీన 'అమిగోస్' రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్ 
  • తాతగారి సినిమాల గురించిన ప్రస్తావన 
  • ఏ సినిమాలను రీమేక్ చేస్తే బాగుంటుందో చెప్పిన కల్యాణ్ రామ్
Amigos movie update

కల్యాణ్ రామ్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగాను .. మరో వైపున నిర్మాతగాను తన అభిరుచిని చాటుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అమిగోస్' రెడీ అవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "మా తాతగారు చేసిన సినిమాల్లో నాకు నచ్చినవేమిటో చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంటుంది. ఆయన సినిమాల్లో నేను రీమేక్ చేయవలసి వస్తే, ఏయే సినిమాలను ఎంచుకుంటాను అంటే మాత్రం ఒక మూడు సినిమాలు మాత్రం గుర్తొస్తాయి. 

'గుండమ్మ కథ' .. 'మిస్సమ్మ' .. 'కన్యాశుల్కం ' ఈ మూడు సినిమాలు నాకు మరింత ఇష్టం. ఈ కథలకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. అందువలన ఈ మూడు సినిమాల్లో ఏదైనా ఒక సినిమాను రీమేక్ చేయాలనుంది" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రయోగాలు చేయడానికి వెనకడుగు వేయని కల్యాణ్ రామ్, ఏ సినిమాను రీమేక్ చేస్తాడనేది చూడాలి.

More Telugu News