Shahdol: వ్యాధిని తగ్గిస్తామంటూ 3 నెలల చిన్నారికి వాతలు.. మధ్యప్రదేశ్ లో రెండో దారుణ ఘటన

  • షాదోల్ జిల్లాలో చికిత్స పొందుతూ చనిపోయిన పసికందు
  • భూతవైద్యురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
Infant dies after branded 20 times with hot iron to cure illness

వ్యాధిని తగ్గిస్తామంటూ మూడు నెలల చిన్నారికి 51 సార్లు వాతలు పెట్టడంతో, 15 రోజులపాటు చికిత్స పొందుతూ పసికందు చనిపోయిన ఘటన ఇటీవల మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. ఈ దారుణం వెలుగులోకి వచ్చి రెండు రోజులు కూడా గడవకముందే.. అదే జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి బయటపడింది.

మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో న్యుమోనియా సోకిన మూడు నెలల చిన్నారికి 20 సార్లు వాతలు పెట్టారు. ‘‘చిన్నారిని బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది’’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పారు. 

వరుస ఘటనల నేపథ్యంలో ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక సూపర్ వైజర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. భూతవైద్యురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇంకా అరెస్టు చేయలేదని సిన్హ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ అహిర్వార్ తెలిపారు.

‘‘రెండో చిన్నారికి కూడా న్యుమోనియా సోకింది. కానీ ఆసుపత్రికి కాకుండా భూతవైద్యురాలి వద్దకు తీసుకెళ్లారు. షాదోల్ జిల్లాలో ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. మరోసారి ఇలా జరగకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని షాదోల్ కలెక్టర్ వందన్ వైద్య చెప్పారు.

More Telugu News