Telangana: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే..!

  • రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్   
  • షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి రూ. 36,750 కోట్ల కేటాయింపు
  • పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
Department wise allocations in Telangana budget

2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా ఉంది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారీ బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు చేసింది. 

శాఖల వారీగా కేటాయింపులు

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
నీటి పారుదల రంగంకు రూ. 26,885 కోట్లు,
వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు
విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15, 233
విద్యుత్ రంగం రూ. 12,727 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
రైతు బంధు పథకంకు రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకంకు రూ. 1,589 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంకు రూ. 200 కోట్లు

  • Loading...

More Telugu News