'అమిగోస్' ఈవెంటులో అందంగా మెరిసిన ఆషిక!

  • కన్నడ ఆడియన్స్ ను అలరిస్తున్న ఆషిక రంగనాథ్ 
  • క్రితం ఏడాదిలోనే కోలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ
  • కల్యాణ్ రామ్ జోడీగా టాలీవుడ్ ఎంట్రీ 
  • ఈ నెల 10న రిలీజ్ అవుతున్న 'అమిగోస్'
Amigos movie update

టాలీవుడ్ కి మరో కన్నడ భామ పరిచయమవుతోంది. 'అమిగోస్' సినిమాలో కల్యాణ్ రామ్ జోడీగా కనువిందు చేయనున్న ఆ బ్యూటీ పేరే 'ఆషిక రంగనాథ్'. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. లిరికల్ సాంగ్స్ రిలీజ్ నుంచే చక్కని కనుముక్కుతీరున్న కథానాయికగా ఈ సుందరి మార్కులు కొట్టేసింది. ఇక నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆషిక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. లైట్ కలర్ పింక్ శారీలో ఆమె కలువ పువ్వులా స్టేజ్ పై విరిసింది. అంతేకాదు చక్కని తెలుగులో మాట్లాడుతూ షాక్ ఇచ్చింది. స్క్రీన్ పై ఎంత అందంగా కనిపించిందో అంతే గ్లామర్ తో స్టేజ్ పై ఆషిక మెరవడం చూపరులను కట్టిపడేసింది.  కన్నడలో వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్న ఆషిక, క్రితం ఏడాదిలోనే తమిళంలో అథర్వ జోడీగా పరిచయమైంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. గ్లామర్ తో పాటు మంచి లౌక్యం తెలిసిన ఈ బ్యూటీకి తెలుగు భాషపై కొంచెం పట్టుంది గనుక, ఇక్కడ తన హవా కొనసాగే అవకాశాలు దండిగానే ఉన్నాయని చెప్పాలి.

More Telugu News