నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్  

  • కొత్త కాన్సెప్టుతో రూపొందిన 'అమిగోస్'
  • కథానాయికగా ఆషిక రంగనాథ్ పరిచయం 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • కథలో కొత్తదనం గురించి ప్రస్తావించిన కల్యాణ్ రామ్
Amigos movie pre release event

కల్యాణ్ రామ్ - ఆషిక రంగనాథ్ జంటగా రూపొందిన 'అమిగోస్' సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. హైదరాబాద్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు.

కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. 'అమిగోస్' అంటే ఫ్రెండ్స్ అని అర్థం. గతంలో మా తాతగారు .. మా బాబాయ్ .. మా తమ్ముడు ఒకే సినిమాలో రెండు మూడు పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ద్విపాత్రాభినయం చేసినా .. ముగ్గురుగా కనిపించినా ఆ పాత్రలన్నీ ఒక ఫ్యామిలీకి సంబంధించి ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాదు .. మనుషులను పోలిన మనుషులకు సంబంధించినది ఇది" అన్నాడు. 

'బింబిసార' తరువాత కొత్తగా ఏం చేయాలా అని చాలా రోజులుగా ఆలోచన చేస్తూ వస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో రాజేంద్ర నాకు ఈ కథ వినిపించాడు. ఈ సినిమాకి వెళ్లిన ఎవరూ కూడా నిరాశ చెందరు. నా తమ్ముడు ఎన్టీఆర్ నా సినిమా ఫంక్షన్స్ కి రావడమనేది చాలా చిన్న విషయం. నేను వేసే ప్రతి అడుగులో ఆయన వెన్నంటే ఉంటూ వస్తున్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News