తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో గాయని వాణీ జయరాం అంత్యక్రియలు పూర్తి

  • చెన్నైలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన వాణీ జయరాం
  • నేడు చెన్నైలో అంత్యక్రియలు
  • వాణీ జయరాం మృతిపై పోలీసు కేసు నమోదు
Vani Jayaram last rites completed in Chennai with Tamilnadu state honours

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం నిన్న చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నుదుటిపై గాయాలు ఉండడంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం కూడా నిర్వహించినట్టు వెల్లడైంది. కాగా, నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు. 

వాణీ జయరాంకి 78 సంవత్సరాలు. 2018లో ఆమె భర్త జయరాం మృతి చెందారు. అప్పటినుంచి చెన్నైలోని హడోవ్స్ రోడ్ లోని తమ నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. నిన్న పనిమనిషి ఆమె ఇంటికి రాగా, ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో, వాణీ జయరాం సోదరికి సమాచారం అందించారు. 

వారు ఇంట్లోకి ప్రవేశించి చూడగా, వాణీ జయరాం బెడ్ రూంలో విగతజీవురాలిగా పడి ఉన్నారు. ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

More Telugu News