నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

  • ఎవరితోనూ లాలూచీ పడనన్న జగ్గారెడ్డి
  • పేదల మేలు కోసం ఎవరినైనా ఎదిరిస్తానని వెల్లడి
  • కేసీఆర్ కిట్ ప్రయోజనకరమని వ్యాఖ్యలు
Jaggareddy says he never a slave to anyone

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తానెవరికీ బానిసను కాదని, ఎవరితోనూ లాలూచీపడనని స్పష్టం చేశారు. పేదవాడికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరిస్తానని అన్నారు. కేసీఆర్ కిట్ వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఇక, రాహుల్ గాంధీపై విమర్శలు చేసే నైతికత ఎవరికీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని గేమ్ లు ఆడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర కంటే తనకు బీజేపీ చరిత్రనే బాగా తెలుసని అన్నారు. 

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపైనా జగ్గారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం చూస్తే, ఆమె మరో మార్గం లేక ఆ విధంగా మాట్లాడినట్టు భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్ కు మధ్య రాజీ కుదిరినట్టుందని వ్యాఖ్యానించారు.

More Telugu News