నారా లోకేశ్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీఎల్

  • యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేశ్
  • పాదయాత్ర పెద్దగా హల్ చల్ చేయడంలేదన్న జీవీఎల్
  • పాదయాత్రపై నెగెటివ్ న్యూసే ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడి
  • నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని వ్యాఖ్యలు
GVL comments on Lokesh Yuvagalam Padayatra

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లోకేశ్ పాదయాత్రపై పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. 

నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని, బలవంతంగా రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం అభివృద్ది చెందదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, వారే తేల్చుతారని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర స్థానికంగా కూడా సంచలనాత్మక రీతిలో సాగుతున్నట్టు అనిపించడంలేదని అన్నారు.

More Telugu News