Chandrababu: కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu visits K Viswanath house
  • గురువారం రాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్
  • నేడు కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
  • కళాతపస్వి చిత్రపటానికి నివాళులు
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు. అక్కడ కళాతపస్వి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

92 ఏళ్ల కె.విశ్వనాథ్ గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.
 

Chandrababu
K.Viswanath
Tributes
Hyderabad

More Telugu News