నాటు బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

  • బాంబు పేలి చెన్నైకి చెందిన గ్యాంగ్ స్టర్ కు తీవ్ర గాయాలు
  • చేతులు పూర్తిగా ఛిద్రం.. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స
  • బాంబుల తయారీ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు 
Chennai gangster injured while making crude bomb loses both hands

నాటు బాంబు తయారు చేస్తుండగా పేలడంతో ఓ గ్యాంగ్ స్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు చేతులు పోగొట్టుకున్నాడు. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘటన.

చెన్నైకి చెందిన ఒట్టెరి కార్తీ.. ఓ కరుడుగట్టిన నేరస్థుడు. ‘‘పుఝల్ జైలులో విజయ్ కుమార్ అనే వ్యక్తితో కార్తికి పరిచయం ఏర్పడింది. రెండు రోజుల క్రితం అంబత్తూర్ లోని ఒరగడాం సమీపంలో కుక్కపిల్లను కొనుగోలు చేస్తానంటూ విజయకుమార్‌ వద్దకు వచ్చాడు. విజయ్ కుమార్ ఇంటిపై నాటు బాంబు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బాంబు పేలింది’’ అని పోలీసులు వెల్లడించారు.

పేలుడు ధాటికి చేతులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. దీంతో వాటిని తీసేయనున్నారు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చావుబతుకుల్లో కార్తి చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో తెలుసుకున్న ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు? ఎక్కడ, ఎవరిపై ఉపయోగిస్తారు? తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

More Telugu News