మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్​ చిత్రం

  • ఇప్పటికే రూ. 729 కోట్ల గ్రాస్ కలెక్షన్
  • ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు
  • భారత్ లోనే రూ. 453 కోట్ల వసూళ్లు
Pathan becomes highest grosser worldwide hindi movie

కొన్నాళ్లుగా వరుస పరాజయాల్లో ఉన్న బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. జనవరి 25న పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించించి. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికి రూ. 729 కోట్లు రాబట్టింది. దాంతో, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ సాధించిన ఒరిజినల్ హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో దంగల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి అగ్రస్థానం సాధించింది. 

దంగల్ ప్రపంచ వ్యాపంగా రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ఇందులో చైనా (చైనీస్)తో పాటు మాండరిన్ భాషలోనే అత్యధిక మొత్తం లభించింది. ఈ నేపథ్యంలో చాలా తక్కువ వ్యవధిలోనే రూ. 700 కోట్ల మార్కును దాటిన ‘పఠాన్’ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి భారత్ బాక్సాపీస్ దగ్గరే రూ. 453 కోట్లు లభించాయి. ఇతర దేశాల్లో రూ. 276 కోట్ల వసూళ్లు వచ్చాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు. ఆదిత్య చోప్రా నిర్మించారు.

More Telugu News