ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్

  • ఎమ్మెల్సీ తలశిల రఘురాం సతీమణి స్వర్ణ కుమారి కన్నుమూత
  • గొల్లపూడిలో స్వర్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్, భారతి
  • రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ దంపతులు
CM Jagan consoled MLC Talashila Raghuram

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఆయన కుటుంబ సభ్యులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పరామర్శించారు. తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి కన్నుమూశారు. సీఎం జగన్, వైఎస్ భారతితో కలిసి ఈ మధ్యాహ్నం విజయవాడ గొల్లపూడి బయల్దేరి వెళ్లారు. స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 

తలశిలను ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. అంతకుముందు స్వర్ణకుమారి మరణవార్త తెలిసి సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

More Telugu News