పాణ్యం నియోజకవర్గంలో ఇంటింటికీ ‘జగన్’ స్టిక్కర్లు

  • కర్నూలులో వైసీపీ ప్రచారహోరు
  • వలంటీర్లకు పాణ్యం ఎమ్మెల్యే ఆదేశం
  • ఇంటియజమానుల అనుమతి తీసుకున్నాకే స్టిక్కర్లు అంటించాలన్న ఎమ్మెల్యే
Panyam mla katasani rambhupal reddy orders pasting jagan stickers on houses in Kurnool

కర్నూలులో ఇంటింటికీ జగన్ స్టిక్కర్లు అంటించేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రజాక్షేమం కోసం జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ప్రజల దృష్టికి చేరేలా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. 

కర్నూలులో జగన్ సంక్షేమ పథకాల అమలు తీరుపై సచివాలయం సిబ్బంది, వాలంటీర్‌లు, వార్డు వైసీపీ కన్వీనర్లతో తాజాగా శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటూ మేయర్ బి.వై.రామయ్య తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని రాసున్న స్టిక్కర్లు అంటించాలని ఆదేశించారు. ఈ క్రమంలో వలంటీర్లు ముందుగా ఇంటి యజమానుల అనుమతి తీసుకున్నాకే స్టిక్కర్లు అంటించాలని స్పష్టం చేశారు.

More Telugu News