మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నా.. డైరెక్టర్ బాబీ

  • గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ బాబీ
  • ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయోత్సవాల్లో ఉన్నట్లు వెల్లడి
  • మరో మెగా హీరోతో కొత్త సినిమా వివరాలు త్వరలోనే చెబుతానన్న డైరెక్టర్ 
my next project with mega hero says director bobby

వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ బాబీ.. తాజాగా క్రేజీ ప్రకటన చేశారు. త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. 

గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో బాబీ మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కలెక్షన్లు బాగా వస్తున్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోని తెలుగు వారు కూడా ఈ మూవీని బాగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. 

తన దర్శకత్వంలో నటించేందుకు చిరంజీవి అంగీకరించడమే తనకు పెద్ద బహుమతితో సమానమని చెప్పారు. ప్రస్తుతం తమ టీమ్ విజయోత్సవాల్లో ఉందని తెలిపారు. మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నానని ఈ సందర్భంగా చెప్పారు. మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. 

ఇప్పటికే మెగా బ్రదర్స్ తో బాబీ సినిమాలు తీశారు. పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవితో వాల్తేరు వీరయ్య రూపొందించారు. ఇప్పుడు తీయబోయే చిత్రం ఎవరితో అనేది హాట్ టాపిక్ గా మారింది. అది రామ్ చరణ్ తోనే కావచ్చని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

More Telugu News