కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ షాకింగ్ కామెంట్స్

  • కర్నూలు జిల్లా ఉల్చాలలో ‘గడపగడపకు’ కార్యక్రమం
  • సుధాకర్‌పై విరుచుకుపడిన మాజీ మండలాధ్యక్షుడు
  • నమ్మకద్రోహి అంటూ ఆగ్రహం
Kodumur YCP MLA Sudhakar Shocking Comments

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. అసమ్మతి నేతలు వరుసగా పార్టీ వ్యతిరేక గళం విప్పుతూ కలకలం రేపుతున్నారు. కోటంరెడ్డి, ఆనం సహా పలువురు నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే చేసిన ప్రకటన సంచలనమైంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. 

కర్నూలు జిల్లాలోని ఉల్చాలలో నిన్న ‘గడపగడపకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వాళ్లను మీరు పక్కనపెట్టారని, మీరు నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు టికెట్ ఇప్పించేందుకు కష్టపడిన వారందరినీ పక్కనపెట్టేశారని ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించుకున్నారని, ఇంతటి నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో నొచ్చుకున్న సుధాకర్.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.

More Telugu News