ఈ వీడియో చూశాక చెప్పండి.. వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో?: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్

  • కుక్కపిల్ల కాళ్లను చెరోవైపు పట్టుకుని గాల్లో గింగిరాలు తిప్పిన యువకుడు, అమ్మాయి
  • గాల్లో ఎగరేస్తూ వికృతానందం
  • విరుచుకుపడుతున్న నెటిజన్లు
  • వారిద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ 
Man and woman swing puppy in air shocking video goes Viral

ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ వీడియోను పోస్టు చేసిన శరణ్.. వీరిలో జంతువు ఎవరు? (జాన్‌వర్ కౌన్?) అని ప్రశ్నించారు. ఆ వీడియోలో ఓ అమ్మాయి, యువకుడు ఉన్నారు. ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు. కుక్కపిల్లను యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందాడు.

ఆ పక్కనే గోడపై ఉన్న కోతులకు కుక్క పిల్లను చూపిస్తూ వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కుక్క పిల్లను హింసించిన యువకుడు, అమ్మాయితోపాటు ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తి... మొత్తం ముగ్గురూ జంతువులేనని, తన ఎదురుగా కనుక ఇలా చేసి ఉంటే వారి మూతి పగలగొట్టి ఉండే వాడినని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

More Telugu News