కోటంరెడ్డి భద్రత 1 ప్లస్ 1 కు తగ్గింపు

  • ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి
  • సొంత పార్టీ వైపే వేలెత్తిచూపుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
  • ఇప్పటివరకు కోటంరెడ్డికి 2 ప్లస్ 2 భద్రత
  • భద్రత తగ్గింపునకు సమ్మతించిన కోటంరెడ్డి!
Security reduced for Kotamreddy

గత కొన్నిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కాక రేపుతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. ఇప్పుడది 1 ప్లస్ 1 కు తగ్గించారు. భద్రత తగ్గింపుపై కోటంరెడ్డి కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్టు తెలుస్తోంది. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కూడా భద్రత తగ్గించడం తెలిసిందే. 

తన ఫోన్ ను సొంత పార్టీయే ట్యాపింగ్ చేస్తోందంటూ కోటంరెడ్డి ఇటీవల వరుసగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తీవ్ర సంచలనం సృష్టించారు. పార్టీ పెద్దలు రంగప్రవేశం చేసినా కోటంరెడ్డి తన ఆరోపణలకు తెరదించలేదు సరికదా, ఆధారాలు ఇవిగోనంటూ మరో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో, పార్టీకి ఆయనకు మధ్య సంబంధం దాదాపు తెగిపోయింది.

More Telugu News