గూడూరులో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య... షాక్ కు గురై గుండెపోటుతో వార్డెన్ మృతి

  • నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన
  • ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి ధరణీశ్వర్ రెడ్డి
  • వార్డెన్ కు సమాచారం అందించిన ఇతర విద్యార్థులు
  • ఒక్కసారిగా కుప్పకూలిన వార్డెన్.. చికిత్స పొందుతూ మృతి
Student commits suicide in Gudur and warden died due to shock

తిరుపతి జిల్లా గూడూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలిసి వార్డెన్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజి హాస్టల్ లో ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ధరణీశ్వర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల. 

కాగా, ధరణీశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఇతర విద్యార్థులు కాలేజి హాస్టల్ వార్టెన్ శ్రీనివాసులునాయుడుకు తెలియజేశారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులునాయుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు మరణాలతో నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది.

More Telugu News